ఓ ప్రభూ! నాకు శాక్తినివ్వు!!
అప్పుడు నేనే సృష్టిలో అందన్నవుతాను!!
పసిపాప నవ్వులో అమాయకత్వాన్ని నేనవుతాను!!
గులాబిరేకులోమృదుత్వాన్ని నేనవుతాను!!
చిటారుకొమ్మన గొంతెత్తి కోయిల గొంతులో రాగాన్నవుతాను!!
చిలుక ముక్కు ఎరుపులో అందం
పిడికిళ్ళు బిగించిన పసిపాప అరచేతి అందాన్నవుతాను!!
బీటలువారిన భూమిమీదపడే చిరుజల్లులోని మొదటి చినుకు నేనవుతాను!!
అంతేకాదు....
విశ్వసృష్టిలో విషాదాన్నంతా భరిస్తాను!!
గూడుకట్టుకున్న నిశబ్దంలో లయిస్తాను!!
శోకంలో ఉన్న వేదనాభరిత సంగీతాన్ని ఆస్వాదిస్తాను!!
ఓ గాడ్!!!నాకు శక్తినివ్వు!!!
శుక్రవారం 28 నవంబర్ 2008
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)